VIDEO: రికవరీ వాహనాన్ని ఢీ కొట్టిన ఆటో

VIDEO: రికవరీ వాహనాన్ని ఢీ కొట్టిన ఆటో

WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ప్రమాదానికి గురైన లారీని రికవరీ వాహనంతో తరలిస్తున్న సమయంలో.. ఎదురుగా వేగంగా వచ్చిన ఆటో రికవరీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.