ముగిసిన మహిళల డే నైట్ వాలీబాల్ పోటీలు
కోనసీమ: తూర్పుపాలెంలో జరిగిన ఆల్ ఇండియా మహిళల డే నైట్ వాలీబాల్ పోటీలు శనివారం రాత్రి ముగిసాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో ఐసీఎఫ్ జట్టు విజేతగా నిలిచి రూ.5 లక్షల బహుమతి గెలుచుకుంది. రాజోలు MLA దేవ వరప్రసాద్ విజేతలకు ట్రోఫీ అందించారు. గ్రామీణ మహిళలు క్రీడల్లో రాణించడం సంతోషకరమని, ఇది క్రీడా స్ఫూర్తిని పెంచుతుందన్నారు.