ఒక్కసారిగా కుప్పకూలిన మూడంతస్తుల భవనం
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడలా కూలి నేలమట్టం అయ్యింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.