ముగియనున్న వారి పదవీకాలం..!

మేడ్చల్: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా ప్రతినిధుల పదవీకాలం మరో ఆరు రోజుల్లో ముగియనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగర శివారు ప్రాంతమైన జవహర్ నగర్, పీర్జాదిగూడ బోడుప్పల్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 2019 జనవరి 27న ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయగా.. ఈనెల 28తో వారి పదవీ కాలం ముగియనుంది.