నేడు విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక

ADB: వాంకిడి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో బుధవారం విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ రామకృష్ణ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.