కాంగ్రెస్‌లో చేరిన పలు పార్టీల నేతలు
JN: పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, సీపీఐఎం నేతలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. అందరికీ సముచిత స్థానం ఉంటుందని వారన్నారు.