అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత
MDK: పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మెదక్ నుంచి పాపన్నపేట వైపు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్‌లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీస్ సిబ్బంది దాడి చేశారు. అనంతరం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు.