'మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి'
NRML: భైంసా మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద శుక్రవారం కలెక్టరేట్‌లో కన్సల్టేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ అమలుతో మున్సిపాలిటీలో పారిశుధ్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు.