దెబ్బతిన్న పంటలను పరిశీలించిన.. వ్యవసాయ శాఖ అధికారులు

BHPL: జిల్లా కమలాపూర్ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను MLA గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు శనివారం పరిశీలించారు. దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించిన అధికారులు, ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సుమలత, మాజీ సర్పంచ్ తోట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.