నగరంలో వాహనాల దారి మళ్లింపు

నగరంలో వాహనాల దారి మళ్లింపు

SKLM: జిల్లా కేంద్రం పాలకొండ రోడ్డులోని కృష్ణా పార్కు వద్ద రహదారి మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ క్రమ బద్దీకరించినట్లు ట్రాఫిక్ విభాగం సీఐ రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి వచ్చే వాహనాలు డే అండ్ నైట్, రామలక్ష్మణ కూడలి మీదుగా పాత బస్టాండ్‌కు వెళ్లాలన్నారు. ఈ నెల 30 వరకు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశామన్నారు.