BDK: 'డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు'
BDK: పినపాక నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతునట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, గుండాల మండలాల్లో ఒక్కో కేంద్రంలో 5 పడకలతో సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్థానికంగానే వైద్యం అందేలా ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. దీంతో రోగులు దూరప్రాంతాలకు వెళ్లె అవసరం తగ్గుతుందన్నారు.