ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ
JGL: ధర్మపురి క్షేత్రంలో అదివారం భక్తుల సందడి నెలకొంది. మార్గశిర మాసం సందర్భంగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. నరసింహుడి ఆలయంలో భక్తులు అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కళ్యాణం జరిపించి పూజలు చేశారు. యమ ధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనె పోసి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు.