కర్నూలు ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం
కర్నూలులో బాలికపై జరిగిన అమానుష ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళల భద్రతపై రాజీ పడబోమని స్పస్టం చేశారు. అలాగే, నిందితులు బోయ మహేంద్ర, శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు.