అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం

అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం

కృష్ణా: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. విజయవాడకు చెందిన ఎస్.ఎల్.వీ డెవలపర్స్ అధినేత పి.శ్రీనివాసరాజు సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. రాబోయే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు.