ప్రమాద బాధితులను కాపాడితే రూ. 25 వేలు
KMM: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జిల్లా రవాణాధికారి కార్యాలయంలో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో మాట్లాడారు. రాహ-వీర్, పీఎం రాహత్ అనే 2 కొత్త పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించిన వారికి రూ. 25 వేలు అందజేస్తామని అన్నారు.