కష్టకాలంలో భారత్ సాయం చేసింది: మాజీ అధ్యక్షుడు

కష్టకాలంలో భారత్ సాయం చేసింది: మాజీ అధ్యక్షుడు

భారత్ తనకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ తెలిపారు. తమ దేశంలో 1988లో విదేశీ కిరాయి సైనికుల మద్దతుతో జరిగిన సాయుధ తిరుగుబాటును భగ్నం చేయడంలో సాయం అందించిందని చెప్పారు. ఢిల్లీ అందించిన సాయానికి శాశ్వత జ్ఞాపకంగా విక్టరీ డే నిలుస్తోందని తెలిపారు. భారత వ్యతిరేకిగా పేరున్న ఆయన ఈ మేరకు సానుకూల వ్యాఖ్యలు చేయటం విశేషం.