వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

కృష్ణా: వాకింగ్‌కి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన కానూరు మురళీనగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఏసు పాద ఉదయశ్రీ ఈ నెల 4న వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య పిల్లి సుదీనా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.