నడికుడి వద్ద ఆర్టీసీ బస్సు.. బొలెరో ఢీ

గుంటూరు: మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న బొలెరోను సోమవారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంతో బొలెరోలో డ్రైవర్తోపాటు మరో వ్యక్తి ఉండగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని 108 లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.