సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై

మహబూబాబాద్: గార్ల మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఎస్సై జీనత్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు తెలియని లింకులను ఓపెన్ చేయరాదని, అపరిచిత వ్యక్తులకు ఓటీపీలను చెప్పవద్దని కోరారు. సైబర్ నేరానికి గురైనట్లు గ్రహించిన వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.