జ్ఞాన సరస్వతీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: లక్కవరపుకోట, జమ్మదేవిపేట గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల విద్యాలయంలో ఇవాళ ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీ జ్ఞాన సరస్వతీ మాత విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థినుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం కేటాయించిన సుమారు రూ. 2.50 లక్షల నిధులతో RO ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.