ప్రకృతి ఆహారంతోనే ఆరోగ్యం: ఎంపీడీవో

ప్రకృతి ఆహారంతోనే ఆరోగ్యం: ఎంపీడీవో

WG: ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మొగల్తూరు ఎంపీడీవో సీహెచ్ త్రిశూలపాణి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయ ఆవరణలో విక్రయిస్తున్న సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను ఆయన కొనుగోలు చేశారు. క్రిమిసంహారక మందులు లేకుండా పండించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగాల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు.