మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, శుక్రవారం మార్కాపురంలో డ్రైవింగ్ చేసే మైనర్లకు సీఐ సుబ్బారావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న వయసులో వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సుబ్బారావు హెచ్చరించారు.