ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య
MHBD: ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కురవిలో జరిగింది. పట్టణనికి చెందిన వల్లుబునేని శశికుమార్‌కు ఇంటర్ చదువుతున్న సమయంలో MHBDకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని యువతిని అతడు కోరగా పరీక్షల తర్వాత చేసుకుందామని యువతి చెప్పడంతో వివాదం తలెత్తింది. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు.