ఈనెల 12న చీరాలలో మెగా జాబ్ మేళా

ఈనెల 12న చీరాలలో మెగా జాబ్ మేళా

చీరాల NRPM హైస్కూల్లో ఈ నెల 12న AP స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాబ్ మేళా కరపత్రాలను చీరాల MLA మద్దులూరి మాలకొండయ్య ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 సంవత్సరాల వయసు నిండి, ITI, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సులు చేసిన యువత మేళాకు అర్హులన్నారు.