సీఎం సహాయనిధి చెక్కు అందజేత
NLG: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. పట్టణంలోని 20వ వార్డు పెద్దబండకు చెందిన పాదూరి వెంకట్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో రూ.37,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును జిల్లా కాంగ్రెస్ నాయకుడు సుభాష్ యాదవ్ మంగళవారం లబ్ధిదారుడికి అందజేశారు.