VIDEO: అయ్యప్ప స్వామి గోదావరి ఆరాట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే
కోనసీమ: ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో అయ్యప్ప స్వామివారి గోదావరి ఆరాట్టు మహోత్సవం, 6వ ఉత్తర నక్షత్ర జన్మదిన వార్షికోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శబరిమల పంపా ఆరాట్టు తరహాలో గోదావరి తీరంలో ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.