ఉచిత బ్యూటీషియన్ కోర్సు ప్రారంభం

ఉచిత బ్యూటీషియన్ కోర్సు ప్రారంభం

KRNL: ఓర్వకల్లు మండల కేంద్రంలో బుధవారం మహిళా సమాఖ్యలో ఉచిత బ్యూటీషియన్ కోర్సును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ కోర్సు అందించిన పొదుపు ఐక్య సంఘాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, MRO, MPDO, సంఘం అధ్యక్షురాలు విజయ భారతి, పాల్గొన్నారు.