వంట గ్యాస్ ధరలపై సీపీఐ నిరసన

వంట గ్యాస్ ధరలపై సీపీఐ నిరసన

KNR: శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తాలో వంటగ్యాస్ ధరల పెంపుపై సోమవారం సీపీఐ నాయకుడు పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. సమ్మయ్య మాట్లాడుతూ.. ఖాళీ గ్యాస్ సిలిండర్‌ను నెత్తిపై పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు, హోటల్ యజమానులు ఇబ్బంది పడుతున్నారన్నారు.