VIDEO: తోటపల్లి డ్యామ్‌కి పెరిగిన వరద ప్రవాహం
PPM: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగావళికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో తోటపల్లి డ్యాంలో గురువారం 6,196 క్యూసెక్కుల నీరు చేరుతుందని ఇంజనీర్లు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలకు ప్రస్తుతం1.484 టీఎంసీలకు పెరిగిందన్నారు. 3గేట్లు ద్వారా 3807 క్యూసెక్కులు నీరు దిగువకు విడిచి పెడుతున్నామన్నారు.