175 బస్సులతో అమరావతికి ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడారు. మే 2న ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి వస్తున్నారన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ టిఫిన్, భోజనం ఏర్పాట్లు చేసి, జాగ్రత్తగా ఇంటికి చేర్చేలా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేశాయన్నారు. 175 బస్సులను ఏర్పాటు చేశామన్నారు.