ఆలయ ప్రారంభోత్సవానికి పెద్దికి ఆహ్వానం

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ ముదిరాజ్ కులస్తులు ఈరోజు నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ముదిరాజ్ సంఘ అధ్యక్షులు సిద్ధ కృష్ణం రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తిప్పరపు రాంబాబు, గ్రామస్తులు తదితరులున్నారు