చేనేత వస్త్రాలను ధరించి.. ప్రోత్సహించండి: జేసీ

NLR: జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు చేనేత వస్త్రాలని, వాటిని ప్రతి ఒక్కరూ ధరించి ప్రోత్సహించడం, చేనేత కళాకారులను గౌరవించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.