రోడ్డుపై మతిస్థిమితం లేని మహిళ

GNTR: కొల్లిపర మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆదివారం ఒక మతిస్థిమితం లేని మహిళ సంచరిస్తూ కనిపించింది. ఆమె వాహనాలకు అడ్డుగా రావడం వల్ల వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా ఆమె బస్టాండ్ సెంటర్, చేపల మార్కెట్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆమెను గుర్తించిన బంధువులు ఎవరైనా ఉంటే తీసుకువెళ్లాలని కోరుతున్నారు.