కారుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం
GNTR: సీఎం చంద్రబాబు 30 ఏళ్ల క్రితం ఉపయోగించిన తన అంబాసిడర్ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర CMగా ఉన్నప్పుడు ఈ కారుతోనే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. అప్పట్లోనే 'CBN బ్రాండ్'గా కారు గుర్తింపు పొందింది. ఇప్పటివరకు HYDలో ఉన్న దీనిని అమరావతిలోని TDP కార్యాలయంలో ఉంచారు. కార్యాలయానికి వచ్చిన ఆయన కారును చూసి ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు.