సంగారెడ్డి అదనపు ఎస్పీగా చైతన్య రెడ్డి బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి అదనపు ఎస్పీగా చైతన్య రెడ్డి బాధ్యతల స్వీకరణ

SRD: జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి చైతన్య రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌ను కలిశారు. గతంలో కామారెడ్డిలో పనిచేసిన ఆయన, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల రక్షణే తన ప్రథమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.