పుల్లంపేటలో 25న మండల సర్వసభ్య సమావేశం

KDP: ఈనెల 25న పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఏవో శ్రీధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మండల అధికారులు హాజరు కావాలన్నారు. అధికారులు తమ శాఖలకు సంబంధించి పూర్తి నివేదికలతో సమావేశానికి రావాలని కోరారు.