'చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి'
ASR: జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు.