వంశీ బెయిల్ సడలింపులపై విచారణ 14కు వాయిదా

కృష్ణా: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి మంజూరైన బెయిల్ షరతుల సడలింపుపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ కేసులో గతంలో కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.