బియ్యం డెలివరీ వేగవంతం చేయాలి: అ. కలెక్టర్

VKB: జిల్లాలోని అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో బకాయి ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR)ను వెంటనే అందజేయాలని, అలాగే ఖరీఫ్, రబీ సీజన్ల బియ్యం డెలవరీలను వేగవంతం చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. AFCI అధికారులు మిల్లర్లకు సహకరించి, గోదాములను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.