తురకపాలెంలో పర్యటించిన CPM నాయకులు
GNTR: తురకపాలెంలో గురువారం సీపీఎం నాయకులు పర్యటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ఇంటింటికీ తిరిగి మరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతామని బాబురావు హెచ్చరించారు.