రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
MNCL: మంచిర్యాల రాజీవ్ నగర్‌లోని మోడల్ స్కూల్ విద్యార్థులు అక్షిత్, అశ్విని, సుష్మిత, స్నేహచైత్ర రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వీరు పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న తెలిపారు.