చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

కృష్ణా: గుడివాడ లక్ష్మీనగర్‌లో ఆగస్టు 30న జరిగిన చోరీ కేసును రూరల్ పోలీసులు 4 రోజుల వ్యవధిలోనే చేదించారు. నిందితులు చోరీ చేసిన సొత్తును పోలీసులు మీడియా ముందు ఇవాళ ప్రదర్శించారు. కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై చంటిబాబు, పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రివార్డులను అందజేశారు. దొంగల నుంచి 71.04 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.