మహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య

ప్రకాశం: దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి(45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. అనంతరం అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.