ఈదురు గాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు

మహబూబాబాద్: కురవి మండలంలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈమేరకు రామచంద్రాపురం గ్రామానికి చెందిన మారేపల్లి రాములు అనే వ్యక్తికి చెందిన రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంటిపై కప్పిన రేకులు అమాంతం గాలుల ప్రభావానికి లేచి పక్కనే ఉన్న కరెంటు లైన్ పై పడిపోవడంతో గ్రామంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.