వైభవంగా పార్వతీ పరమేశ్వరుల పల్లకి ఊరేగింపు
VZM: తెలుగు సంవత్సరాది పురస్కరించుకుని గజపతినగరంలో గురువారం ఉదయం పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా జరిగింది. గజపతినగరం మండలంలోని పురిటిపెంట సరాబుల కాలనీలో గల మల్లికార్జున స్వామి ఆలయం అర్చకులు మణికంఠ పర్యవేక్షణలో పార్వతి పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఊరేగింపుకు ముందుగా మహిళలు దీపాలను చేత పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు.