జౌలాపురంలో రహదారి పనులకు శ్రీకారం

జౌలాపురంలో రహదారి పనులకు శ్రీకారం

NRPT: మక్తల్ మండలం జౌలాపురం గ్రామంలో జక్లేర్‌కు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతినడంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.