కరీంనగర్ నుంచి తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్
కరీంనగర్‌కు చెందిన పైడి జయరాజ్ 1900 సంవత్సరంలో జన్మించి, 1928 సం.లో ముంబాయిలో సినీ రంగంలో ప్రవేశించారు. 71 ఏళ్ల కెరీర్‌లో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 100కి పైగా సినిమాల్లో నటించి, 1960లో దర్శకుడిగా కూడా పరిచయమయ్యారు. హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పనిచేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలంగాణ వాసిగా గర్తింపు పొందారు. 2000 ఆగస్టు 11న మరణించారు.