జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

కోనసీమ: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న జర్నలిస్టులు, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారు.