ఏనుగు దాడిలో ఆవు, దూడ మృతి

ఏనుగు దాడిలో ఆవు, దూడ మృతి

CTR: గంగవరం మండలం, బండమీదజరావారిపల్లి అడవి సమీప పొలాల వద్ద ఆదివారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు దూడ మృతి చెందగా అక్కడే ఉన్న మిగతా నాలుగు ఆవులు తాళ్లు తెంపుకొని వెళ్లి పోయాయని, లేకుంటే మరి కొన్ని ఆవులు చనిపోయేవని యజమాని గంగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ ఏనుగులు దాడి చేశాయని రైతు తెలిపాడు.