మల్లేశ్వరస్వామి ఆలయంలో అవకతవకలపై ఎంక్వైరీ

GNTR: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీకి ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్లలో దేవస్థానానికి సంబంధించిన నిధులను గోల్‌మాల్ చేస్తూ స్వలాభం కోసం వాడుకున్న వ్యక్తులపై పూర్తి దర్యాప్తు జరిపి అవకతవకలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎండోమెంట్ కమిషనర్ మంగళవారం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.